: క్రికెట్ మ్యాచ్ అడ్డుకుంటాడని కాదట... హార్దిక్ పటేల్ ను అరెస్ట్ చేసిన కారణం ఏమిటంటే...!


నిన్న రాజ్ కోట్ లో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ ని అడ్డుకునేందుకు వెళుతున్న గుజరాత్ పటేల్ వర్గం యువనేత హార్దిక్ పటేల్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మ్యాచ్ చూసేందుకు వెళ్తున్న ఆయనను అరెస్ట్ చేసిన తరువాత పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి కూడా. అయితే, ఆయన్ను అరెస్ట్ చేసిన కారణం మ్యాచ్ ని అడ్డుకుంటాడని కాదట! గతంలో "పటేళ్లు ఆత్మహత్యలు చేసుకునే బదులు ఇద్దరు ముగ్గురు పోలీసులను హతమార్చండి" అని వ్యాఖ్యానించినందుకు అరెస్ట్ చేసినట్టు పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. యువత మనసుల్లో విషబీజాలు నింపుతున్నాడన్న ఆరోపణలపై కేసు నమోదు చేసి ఆయన్ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News