: శంకుస్థాపనకు బాబా రాందేవ్, వీవీఎస్ లక్షణ్... 245 మంది విదేశీ ప్రముఖులకు ఆహ్వానం
ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందుతున్నాయి. ఆహ్వానాలు అందుకున్న వారంతా తాము తప్పకుండా హజరవుతామని చెబుతున్నారు. అమరావతి వెయ్యేళ్లు పరిఢవిల్లాలని అభిలషిస్తున్నారు. ఈ క్రమంలో, ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్, మాజీ టీమిండియా బ్యాట్స్ మెన్ వీవీఎస్ లక్ష్మణ్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాతా అమృతంగమయి శంకుస్థాపనకు హాజరవుతామని స్పష్టం చేశారు. మరో విషయం ఏమిటంటే, ఇప్పటి వరకు 245 మంది విదేశీ ప్రముఖులకు అమరావతి ఆహ్వానం అందింది. మరోవైపు శంకుస్థాపనకు హాజరవుతున్న ప్రముఖులకు ఎలాంటి లోటు లేకుండా సకల సౌకర్యాలను వాయువేగంతో పూర్తి చేస్తున్నారు.