: ట్యాంకుబండ్ పై కొత్తగా కొలువుదీరే తెలంగాణ మహనీయుల విగ్రహాలివే!


ఆంధ్రా పాలకులు విస్మరించిన తెలంగాణ వైతాళికులు, మహనీయుల విగ్రహాలను ట్యాంకుబండ్ పై దశలవారీగా ప్రతిష్ఠిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అతి త్వరలో నగర తొలి కొత్వాల్ రాజ్ బహదూర్ వెంకట్రామిరెడ్డి, రావి నారాయణరెడ్డి, సురవరం ప్రతాప్ రెడ్డిల విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. రెడ్డి జన సంఘం గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ, అత్యాధునిక రెడ్డి హాస్టల్ నిర్మాణం నిమిత్తం రెండు మూడు రోజుల్లో రూ. 10 కోట్ల నిధులను మంజూరు చేయడంతో పాటు 5 నుంచి 10 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పది రోజుల్లో స్థల పత్రాలను కమిటీకి అందిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News