: సాఫీగా పడ్డ తొలి బంతి... కనిపించని పటేళ్ల సందడి!
భారత్, దక్షిణాఫ్రికాల మధ్య మూడవ వన్డే రాజ్ కోట్ లో ప్రారంభమైంది. ముందుగా ఊహించినట్టుగా స్టేడియంలో పటేళ్ల సందడి పెద్దగా కనిపించడం లేదు. తొలి ఓవర్ ను భువనేశ్వర్ కుమార్ వేయగా, దక్షిణాఫ్రికా ఓపెనర్లు ఒక్క పరుగును కూడా రాబట్టలేకపోయారు. ఆందోళనలు చేస్తారన్న ఉద్దేశంతో పలువురు అనుమానితులను స్టేడియంలోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. స్టేడియం లోపల సైతం వందలాది మంది పోలీసులు పహారా కాస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా స్టేడియంలోకి వాటర్ బాటిళ్లు సహా ఏ వస్తువులనూ అనుమతించలేదు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు రెండు ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 5 పరుగులు. డికాక్ 4, మిల్లర్ 1 పరుగుతో క్రీజలో ఉన్నారు.