: ఈ పిచ్చి గోలేంటి? ప్రధాని బాధపడుతున్నారంటూ... బీజేపీ నేతలకు అమిత్ షా సమన్లు


గత కొంత కాలంగా ఆవు మాంసం, దాద్రి ఘటన, ముస్లింలకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆ పార్టీ అధిష్ఠానం తీవ్రంగా స్పందించింది. దేశంలో అశాంతిని పెంచేలా నేతలు చేసిన వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోదీకి బాధను కలిగిస్తున్నాయంటూ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పలువురు నేతలకు సమన్లు పంపారు. ఈ పిచ్చి గోలేంటని ప్రశ్నించిన ఆయన, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్ ఖట్టర్, కేంద్ర మంత్రి మహేశ్‌ శర్మ, భాజపా ఎంపీ సాక్షి మహారాజ్, ఎమ్మెల్యే సంగీత్ సోమ్‌ల కు సమన్లు జారీ చేసి వెంటనే వీటికి సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. వీరందరినీ ఇకపై వివాదాస్పద కామెంట్లు చేయవద్దని హెచ్చరించారు. ఈ తరహా వ్యాఖ్యలపై ప్రధాని సహించబోరని అన్నారు. కాగా, సమన్ల విషయమై స్పందిస్తూ, తాము అమిత్ షాతో ఈ విషయమై చర్చించనున్నామని సంగీత్ సోమ్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News