: ఆవులను హింసించిన వారిని చంపేయాలని వేదాలు చెబుతున్నాయన్న ఆర్ఎస్ఎస్


హిందువులకు పవిత్రమైన గోవులను హింసించిన వారిని హత్య చేయాలని వేదాలు ఆదేశిస్తున్నాయని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధికార పత్రిక 'పాంచజన్య'లో ప్రత్యేక కథనం రావడం కొత్త చర్చకు తెరలేపింది. దాద్రి ఘటన, ఆపై హరిద్వార్ సమీపంలో ఆవులను తీసుకెళ్తున్న వ్యక్తిపై దాడి చేసి హత్య చేయడం వంటి ఘటనలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపగా, ఇప్పుడు పాంచజన్యలో ముఖ కథనం రూపంలో ఆర్ఎస్ఎస్ తన మనోభావాలను వెల్లడించినట్లయింది. ఆవులు హిందువులకు, హిందూ మత విశ్వాసాలకు ప్రతీకలని, ఆవు మాంసం తినడం హిందువులను అగౌరవ పరిచినట్టేనని తెలిపింది. దాద్రి ఘటనను ప్రస్తావిస్తూ, గోవును హింసించినందుకు అది అతనికి పడ్డ శిక్షగా అభివర్ణించింది. కాగా, ఈ కథనం పత్రిక సంపాదకీయం కాదని, రచయిత తమ ఎడిటోరియల్ బోర్డు వ్యక్తి కాదని పాంచజన్య ఎడిటర్ హితీష్ శశాంక్ తెలిపారు.

  • Loading...

More Telugu News