: ఎన్టీఆర్ చేతుల మీదుగా అన్నప్రాసన చేయించుకున్న ఆ జంట బిడ్డకు నేడు అదే వేడుక


ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణల మనవడు, లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు దేవాన్ష్ కు నేడు తిరుమల శ్రీవెంకటేశ్వరుని సన్నిధిలో అన్నప్రాసన జరగనుంది. అటు లోకేష్ కు, ఇటు బ్రాహ్మణిలకు తాత హోదాలో ఆనాడు ఎన్టీ రామారావు తిరుమలలోనే అన్న ప్రాసన చేశారు. ఇప్పుడు అదే చోట దేవాన్ష్ కు అన్నప్రాసన చేయాలని చంద్రబాబు నిర్ణయించడంతో నారా వారి వారసుడికి నేడు ఆ వేడుక జరగనుంది. ఇందుకోసం చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్ దంపతులతో పాటు పలువురు తెలుగుదేశం నేతలు తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా దేవాన్ష్ పేరిట రూ. 20 లక్షలను అన్నదాన పథకానికి విరాళంగా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News