: పది మంది ఉద్యోగులు పనిచేసే కంపెనీలకూ ఈపీఎఫ్... చట్టాన్ని సవరించనున్న కేంద్రం


చిన్న కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు శుభవార్త. పది మంది ఉద్యోగులు విధుల్లో ఉన్న కంపెనీలకు కూడా ఉద్యోగ భవిష్యనిధి (ఈపీఎఫ్) సౌకర్యం కల్పించేందుకు చట్టాన్ని సవరిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఈపీఎఫ్ పొందాలంటే, కనీసం 20 మందికి పైగా ఉద్యోగులు ఆ సంస్థలో పనిచేయాల్సి వుండగా, దీన్ని 10కి కుదించాలని భావిస్తున్నట్టు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. చట్ట సవరణ జరిగితే కోట్ల మందికి పెన్షన్ తో పాటు, పదవీవిరమణ ప్రయోజనాలు, మెడికల్, జీవిత, ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలు కలుగుతాయని ఆయన తెలిపారు. రూ. 7 వేలకు పైగా వేతనం తీసుకుంటున్న ప్రతి ఉద్యోగికీ పీఎఫ్ వచ్చేలా చూస్తామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News