: హీరో అజిత్ కు మరోసారి గాయం


ప్రముఖ తమిళ సినీనటుడు అజిత్ కు మరోసారి గాయమైంది. ఆయన నటిస్తున్న 'వేదాళమ్' చిత్రం పెరంబూర్ లోని బిన్ని మిల్లులో షూటింగ్ జరుపుకుంటోంది. పాటను చిత్రీకరిస్తుండగా కుడికాలు మడమకు గాయమైంది. దీంతో కాలును పట్టుకుని ఆయన బాధతో విలవిల్లాడాడు. ఈ నేపథ్యంలో, షూటింగ్ క్యాన్సిల్ చేద్దామని దర్శకుడు సూచించాడు. అయినా గాయాన్ని లెక్కచేయని అజిత్ షూటింగ్ ను కంటిన్యూ చేశాడు. గతంలో 'ఆరంభం' సినిమా సమయంలో కారు అదుపు తప్పి అజిత్ కాలు మీద నుంచి వెళ్లింది. దీంతో ఆయన కాలుకు తీవ్ర గాయమైంది. అప్పట్లో అజిత్ వైద్య చికిత్స చేయించుకుని, కొంత కాలం విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్పుడు అదే కాలుపై ఒత్తిడి ఎక్కువ కావడంతో నొప్పి తిరగబెట్టింది.

  • Loading...

More Telugu News