: ఒకప్పుడు క్రికెటర్... ఇప్పుడు చైన్ స్నాచర్


ఒకప్పుడు రాష్ట్ర స్థాయిలో క్రికెట్ ఆడాడు. ఆ తర్వాత పక్కదారి పట్టి చైన్ స్నాచర్ గా మారాడు. వివరాల్లోకి వెళ్తే, అండర్-19 విభాగంలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ముర్తజా అలీ (30) ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత నేరాల బాట పట్టి, ఓ గ్యాంగ్ ను తయారు చేసుకున్నాడు. ఈ క్రమంలో చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డాడు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ గ్యాంగ్ చైన్ స్నాచింగ్ లకు పాల్పడేది. చివరకు ఈ గ్యాంగ్ పోలీసులకు దొరికిపోయింది. గ్యాంగ్ లీడర్ ముర్తజా అలీతో పాటు గ్యాంగ్ లోని షాదబ్, హైదర్, రజా అలీ, గుఫ్రాన్ లను జహంగీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి నాలుగు మోటార్ బైక్ లు, పది బంగారు చైన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరికి ఇప్పటి వరకు 75కి పైగా నేరాల్లో ప్రమేయం ఉంది. వీరిని కోర్టులో హాజరుపరచగా... ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది.

  • Loading...

More Telugu News