: చీర, సారె... తాపేశ్వరం స్వీట్ బాక్స్ కూడా!... నేలపాడు రైతులకు ఏపీ సర్కారు ఆహ్వానం


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులను ఏపీ సర్కారు ముఖ్య అతిథులుగా పరిగణిస్తోంది. ప్రముఖులకు ఆహ్వానాలు పంపడం కంటే కూడా రైతుల ఇళ్లకు వెళ్లి ఆహ్వాన పత్రికతో పాటు చీర, సారెతో స్వాగతం పలకాలని నిర్ణయించింది. ఈ మేరకు రాజధాని నిర్మాణం కోసం అందరికంటే ముందుగా భూములిచ్చిన నేలపాడు రైతులకు ఏపీ మంత్రి నారాయణ, విజయవాడ ఎంపీ కేశినేని నానిలు సడన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆహ్వాన పత్రికలతో పాటు రైతుల కుటుంబాలకు వారు ఓ సంచిని కూడా అందజేశారు. ఈ సంచిలో చీర, సారెతో పాటు తాపేశ్వరం నుంచి తెప్పించిన ఓ స్వీట్ బాక్సు కూడా ఉంది. సంచిని విప్పి చూసిన నేలపాడు రైతులు మంత్రి, ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ప్రభుత్వం తమను ఆహ్వానిస్తున్న తీరుతో తమ ఇళ్లకు అప్పుడే దసరా కళ వచ్చేసిందని రైతులు ప్రకటించారు.

  • Loading...

More Telugu News