: ‘ప్రకాశం’ ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి... క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం ఆదేశాలు
ప్రకాశం జిల్లా కందుకూరు మండలం చెర్లోపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేటి తెల్లవారుజామున చోటుచేసుకున్న ప్రమాదంపై సమాచారం అందుకున్న చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు వదిలిన మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని ఆయన మంత్రులకు సూచించారు.