: ప్రకాశం జిల్లాలో రోడ్ టెర్రర్... ప్రైవేట్ బస్సు-లారీ ఢీ, ఏడుగురు దుర్మరణం


తెలుగు నేలపై మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఏపీలోని ప్రకాశం జిల్లాలో నేటి తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని కందుకూరు మండలం చెర్లోపల్లి వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు ప్రయాణీకులు అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెనువెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News