: రాజ్ కోటలో రెండు జట్ల ఆటగాళ్లను అడ్డుకుంటాం: హార్దిక్ పటేల్
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న మూడో వన్డేను అడ్డుకుంటామని పాటీదార్ అనామత్ ఆందోళన్ సమితి నాయకుడు హార్దిక్ పటేల్ హెచ్చరించాడు. గుజరాత్ లోని రాజ్ కోట్ స్టేడియంలో ఆదివారం నాడు మూడో వన్డే జరగనున్న విషయం తెలిసిందే. రెండు జట్ల ఆటగాళ్లు స్టేడియం లోపలికి రాకుండా అడ్డుకుంటామన్నారు. తమ సామాజిక వర్గానికి టికెట్లు అమ్మకపోవడంపై ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు హార్దిక్ చెప్పాడు. ఈ యువనేత హెచ్చరికతో స్టేడియం చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, మ్యాచ్ సజావుగా సాగేందుకు పోలీసులు కసరత్తులు ప్రారంభించారు. స్టేడియం చుట్టూ 90 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. రెండు జట్ల ఆటగాళ్లు ఇప్పటికే రాజ్ కోట్ స్టేడియంకు చేరుకున్నారు.