: రాజధాని శంకుస్థాపనకు తమిళనాడు గవర్నర్ రోశయ్యను ఆహ్వానించిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి


నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనాలంటూ తమిళనాడు గవర్నర్ రోశయ్యను కేంద్ర మంత్రి సుజనా చౌదరి స్వయంగా కలసి ఆహ్వానించారు. రాష్ట్రానికి చెందిన ప్రముఖ వ్యక్తి, తమిళనాడు గవర్నర్ రోశయ్యకు ఆహ్వాన పత్రాన్ని కొరియర్ ద్వారా పంపినట్లు తొలుత వార్తలు వెలువడ్డాయి. అయితే కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఈ రోజు చెన్నై లో గవర్నర్ రోశయ్యను కలసి స్వయంగా ఆహ్వాన పత్రాన్ని అందజేయడంతో ఆ వార్తలో వాస్తవం లేదని తేలింది.

  • Loading...

More Telugu News