: తప్పిపోయిన బాలీవుడ్ నటుడి కూతురు


బాలీవుడ్, భోజ్ పురి నటుడు రవికిషన్ తన కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని డీసీపీ (డిటెన్షన్) ధనుంజయ్ కులకర్ణి తెలిపారు. కొన్నిరోజుల కిందట బంగుర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు ఫిర్యాదు అందినట్లు చెప్పారు. రవికిషన్ పంతొమ్మిదేళ్ల కూతురు ఈవిధంగా కనిపించకుండా పోవడం రెండోసారని పోలీసు వర్గాల సమాచారం. అంతకుముందు ఒకసారి ఆమె తల్లిదండ్రులను వదిలేసి బయటకు వెళ్లిందని వారు తెలిపారు. కాగా, రవికిషన్ భోజ్పురి నటుడిగా బాగా ప్రజాదరణ పొందిన నటుడు. ఇటీవల బిగ్బాస్, ఏక్ సే బడ్ఖర్ ఏక్- జల్వా సితారోంకా వంటి టీవీ కార్యక్రమాల ద్వారా మంచి ఆదరణ లభించింది.

  • Loading...

More Telugu News