: చర్లపల్లి జైల్లో ఉన్న ఉగ్రవాదిని కలిసేందుకు వచ్చిన హుజీ ఉగ్రవాది అరెస్ట్


చర్లపల్లి జైల్లో ఉన్న పాక్ ప్రేరేపిత ఉగ్రవాది నజీర్ ను కలిసేందుకు వచ్చిన మరో ఉగ్రవాది అలీముల్ ఇస్లాంను హైదరాబాద్ పోలీసులు ఈ మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. ఇతను నిషేధిత ఉగ్రవాద సంస్థ హుజీకి చెందినవాడిగా అనుమానిస్తున్నారు. నజీర్ తో కలసి ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యే యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఓ జీహాదీ కేంద్రాన్ని ప్రారంభించే ఆలోచనలో అలీముల్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. జీహాదీ సెంటర్ ఏర్పాటుకు కుట్రలో భాగంగా అలీముల్ చర్చలకు వస్తున్నాడన్న పక్కా సమాచారంతో పోలీసులు వలపన్ని ఆయన్ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News