: గవర్నర్ తో కేసీఆర్ భేటీ... బతుకమ్మ వేడుకలకు రావాలని ఆహ్వానం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు నేడు రెండు ఆహ్వానాలు అందాయి. తన కొడుకు పెళ్లికి రావాలని ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కొద్దిసేపటి క్రితం గవర్నర్ ను ఆహ్వానించారు. ఆ తర్వాత తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా కొద్దిసేపటి క్రితం నరసింహన్ ను కలిసేందుకు రాజ్ భవన్ కు వెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో భాగంగా ముగింపు కార్యక్రమానికి హాజరుకావాలని ఆయన గవర్నర్ ను ఆహ్వానించారు. కేసీఆర్ ఆహ్వానానికి నరసింహన్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.