: ‘ఎనీ టైం మనీ’కి జత కలిసిన ‘ఎనీ టైం లోన్’...‘హెచ్ డీఎఫ్ సీ’ కొత్త స్కీం ప్రారంభం


ఏటీఎం... అసలు పేరు ‘ఆటోమేటిక్ టెల్లర్ మెషీన్’ అయినా, ‘ఎనీ టైం మనీ’గానే మనం పరిగణిస్తున్నాం. ఎందుకంటే, బ్యాంకు గడప తొక్కకుండానే నగదును డ్రా చేసుకునే వెసులుబాటును మనకు కల్పిస్తుంది కాబట్టి. అంతేకాదు, జేబులో సింగిల్ కరెన్సీ నోటు లేకుండా వెళ్లినా, కేవలం ఏటీఎం కార్డుంటే సరిపోయేలా ఆర్థిక కార్యకలాపాల్లో పెను విప్లవం వచ్చేసింది. ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో పేరెన్నికగన్న ‘హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు’ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో అందరికన్నా ముందుంది. తాజాగా ఈ బ్యాంకు ‘ఎనీ టైం మనీ’కి ‘ఎనీ టైం లోన్’ను జత చేసింది. ఏటీఎం కార్డు ద్వారానే నిమిషాల వ్యవధిలో స్వల్ప మొత్తంలో రుణాలను అందించేందుకు ఆ బ్యాంకు శ్రీకారం చుట్టింది. అవసరం ఉన్న కస్టమర్ల ఖాతాల వివరాలను పరిశీలించనున్న బ్యాంకు అప్పటికప్పుడు రుణాలను మంజూరు చేస్తోంది. ఇందుకోసం సదరు బ్యాంకులో ఖాతాలు ఉన్న వినియోగదారులు ‘నెట్ బ్యాంకింగ్’లోకి ప్రవేశించి కేవలం 10 నిమిషాల్లో రుణం పొందవచ్చట. ఈ మేరకు బ్యాంకు కొత్త స్కీంను ప్రవేశపెట్టింది.

  • Loading...

More Telugu News