: తమిళ కూలీల విడుదలకై చంద్రబాబుకు జయలలిత లేఖ


ఆంధ్రప్రదేశ్ జైళ్లలో మగ్గుతున్న తమిళ కూలీలను విడుదల చేయాలంటూ సీఎం చంద్రబాబుకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లేఖ రాశారు. 516 మంది ఎర్రచందనం కూలీల విడుదలకు చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. పట్టుబడ్డ ఎర్రచందనం కూలీలు అమాయకులని, వారు బెయిల్ కు అర్హులని జయలలిత పేర్కొన్నారు. కాగా, చిత్తూరు, కడప జిల్లాల్లో ఎర్రచందనం అక్రమ రవాణాకు తమిళ కూలీలు సహకరిస్తుండటంతో వారిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి, కడప జిల్లా పోరుమామిళ్ల, ఖాజీపేట, తదితర ప్రాంతాల్లోను, చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం అటవీ ప్రాంతంలోను పలువురు తమిళ కూలీలను ఈ మధ్య కాలంలో అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News