: జగన్ వేస్ట్... కేటీఆర్ బెస్ట్: సోమిరెడ్డి
ఏపీ ప్రతిపక్షనేత జగన్ పై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్ర రాజధానికి శంకుస్థాపన జరగడాన్ని కూడా అడ్డుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి తర్వాత అంతటి స్థానం (ప్రతిపక్ష నేత)లో ఉన్న వ్యక్తిలా జగన్ ప్రవర్తించడం లేదని... అతని వ్యక్తిత్వం చిన్న పిల్లాడిని తలపిస్తోందని ఎద్దేవా చేశారు. శంకుస్థాపనకు హాజరు కాలేనని జగన్ ప్రకటించడాన్ని సోమిరెడ్డి తప్పుబట్టారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెజ్ ల పేరుతో వేలాది ఎకరాలను రైతుల నుంచి లాక్కున్నారని... అలాంటి వ్యక్తులకు అమరావతి గురించి మాట్లాడే హక్కు లేదని విమర్శించారు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలున్నప్పటికీ... తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానిస్తే తప్పకుండా హాజరవుతామని చెప్పిన సంగతిని గుర్తు చేశారు. రాజకీయంగా ఎన్నో వైరుధ్యాలున్నప్పటికీ, కొన్ని విషయాల్లో కలసి ముందుకు పోవాల్సి ఉంటుందని సూచించారు.