: అది నా అనారోగ్యం మాత్రమే... అనుచరుడితో కాళ్లకు చెప్పులు తీయించుకోవడంపై కేరళ స్పీకర్ వివరణ


ఓ అనుచరుడితో తన చెప్పులు తీయించుకుని, ఆపై ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తగా నష్ట నివారణకు దిగిన కేరళ స్పీకర్ ఎన్.శక్తన్ వివరణ ఇచ్చారు. గత 18 సంవత్సరాలుగా తాను డయాబెటిక్ రెటినోపతితో బాధపడుతున్నానని, వైద్యుల సూచన మేరకు తాను ముందుకు వంగరాదని, వంగితే కళ్లలో బ్లీడింగ్ జరగచ్చని ఆయన తెలిపారు. అందువల్లే దూరపు బంధువైన తన కారు డ్రైవర్ ఒకరు చెప్పులు తీయడంలో సహాయం చేస్తున్నాడని తెలిపారు. తాను ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళితే, తీసిన ఓ చిత్రంపై చర్చ జరగడం బాధగా ఉందని తెలిపారు. తాను మూడు దశాబ్దాలకు పైగా ఎమ్మెల్యేగా సేవలందించానని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యానికి సంబంధించిన రిపోర్టులను ఆయన మీడియాకు సమర్పించారు. ఆయన డయాబెటిక్ రెటినోపతీ వ్యాధితో బాధపడుతున్నట్టు ఆ రిపోర్టులలో వుంది.

  • Loading...

More Telugu News