: నాకు ఇష్టమైన బౌలర్లలో జహీర్ ఒకడు: ప్రభాస్


లెజెండరీ కపిల్ దేవ్, జవగల్ శ్రీనాథ్ ల తర్వాత టీమిండియా పేస్ బౌలింగ్ బాధ్యతలను కొన్నేళ్లపాటు తన భుజస్కందాలపై మోసిన జహీర్ ఖాన్ నేడు అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఈ తరుణంలో పలువురు సెలబ్రిటీలు, మాజీ ఆటగాళ్లు జహీర్ ఖాన్ అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. తనకు ఇష్టమైన బౌలర్లలో జహీర్ ఖాన్ ఒకడని టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తెలిపాడు. జహీర్ చాలా మంచివాడు... ఉత్తమ బౌలర్... నా సోదరుడికి మంచి జరగాలని దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడు. జహీర్ ఓ పర్ ఫెక్ట్ జంటిల్ మెన్... సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకున్నాడు... తన కొత్త ఇన్నింగ్స్ గొప్పగా ఉండాలని కోరుకుంటున్నానని సురేష్ రైనా తెలిపారు. జహీర్ తో కలసి ఆడటం తమకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని... అతని క్రికెట్ చాలా గొప్పదని అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు.

  • Loading...

More Telugu News