: నాలుగు నెలల్లో వాహనాల నెంబర్ ప్లేట్లు మార్చుకోవాల్సిందే: కేసీఆర్ సర్కారు ఉత్తర్వుల జారీ
తెలంగాణలో ఉన్న అన్ని వాహనాల నంబర్ ప్లేట్లను వచ్చే నాలుగు నెలల్లోగా మార్చుకోవాలని కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఈ మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ అయ్యాయి. వాహనానికి ఉన్న నాలుగంకెల సంఖ్య కొనసాగుతుందని తెలిపిన ఈ ఉత్తర్వులు, నంబర్ ప్లేట్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉంటుందని వివరించింది. 'ఏపీ' అని ఉన్న చోట 'టీఎస్', జిల్లా కోడ్ లు మారతాయని వివరించింది. ఆన్ లైన్ ద్వారా కూడా వాహన రిజిస్ట్రేషన్ సంఖ్యను మార్చుకునే సదుపాయం కల్పిస్తున్నామని తెలుపుతూ రవాణా మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.