: ఎన్ కౌంటర్లో హతమైన ఉగ్రవాదులు గతంలో పోలీసు అధికారులు!


ఈ ఉదయం జమ్ము కాశ్మీర్ లో చోటు చేసుకున్న ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను భారత బలగాలు కాల్చి చంపాయి. అనంతరం, డిఫెన్స్ పీఆర్వో ఎస్ఎన్ ఆచార్య మాట్లాడుతూ, చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు గత నెల వరకు భారత బలగాల్లో ప్రత్యేక పోలీసు అధికారులు (ఎస్పీవో)గా పనిచేశారని వెల్లడించారు. సెప్టెంబర్ 6, 7 తేదీల్లో దోడా జిల్లాలో వీరిద్దరూ ఆయుధాలతో సహా పారిపోయి, ఉగ్రవాదులతో చేయి కలిపారని చెప్పారు. గతంలో కూడా వీరు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారని... అయితే, అప్రూవర్ గా మారిపోయారని... దీంతో, సైన్యానికి సహాయం చేసే నిమిత్తం వీరికి ప్రత్యేక అధికారుల బాధ్యతలను అప్పగించినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News