: కంటతడి పెట్టిన ఎమ్మెల్యే ఈలి నాని
కుమార్తె ప్రేమ వివాహం వ్యవహారంలో తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు ఈలి నాని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తనను నాలుగేళ్ళుగా గృహ నిర్బంధంలో ఉంచారంటూ కుమార్తె రమ్య నేడు కోర్టుకెక్కిన నేపథ్యంలో నాని కంటతడిపెట్టారు. తీవ్ర భావోద్వేగాల నడుమ ఆయన మాట్లాడుతూ, ఏ తండ్రికీ ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు.