: నిలిచిన ప్రైవేట్ బస్సు... రాత్రంతా నడిరోడ్డుపై ప్రయాణికుల జాగారం
తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకుల నిర్వాకాలు నానాటికి పెరిగిపోతున్నాయి. నిన్న రాత్రి నిండా ప్రయాణికులతో కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి హైదరాబాదుకు బయలుదేరిన శ్రీలక్ష్మి ట్రావెల్స్ బస్సు పాలమూరు జిల్లా జడ్చర్ల సమీపంలో నడిరోడ్డుపై నిలిచిపోయింది. ప్రయాణికులను కిందకు దించేసిన బస్సు డ్రైవర్ ఆపై బస్సు మరమ్మతులను అంతగా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో రాత్రంతా ప్రయాణికులు నడిరోడ్డుపైనే జాగారం చేశారు. దీనిపై సమాచారం తెలిసినా ట్రావెల్స్ యాజమాన్యం పట్టించుకోలేదని ప్రయాణికులు వాపోయారు. అంతేకాక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంపై యాజమాన్యం ఏమాత్రం దృష్టి సారించలేదు.