: బీజేపీ ఎంపీపై రాళ్లు రువ్విన ప్రజలు
భారతీయ జనతా పార్టీ ఎంపీపై హర్యానా ప్రజలు రాళ్లు రువ్వారు. విద్యుత్ టారిఫ్ చార్జీలు పెంచడమే ఇందుకు కారణం. కైతాల్ జిల్లా సివాన్ గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ రాజ్ కుమార్ సైనికిపై ప్రజలు రాళ్లు రువ్వారు. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కుల్వంత్ బజిగర్ ఆహ్వనం మేరకు రాజ్ కుమార్ అక్కడికి వెళ్లారు. ఎంపీ అక్కడికి వెళ్లినప్పటి నుంచి ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే, ఈ ఘటనలో ఎంపీ, ఎమ్మెల్యే కు ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. తమకు మాత్రం రాళ్ల దెబ్బలు తగిలాయని పోలీసులు వెల్లడించారు.