: మీరు కాదు.. నేనే చెత్త డ్యాన్సర్ ని: బిగ్ బీ


‘పని చేయడం అంటే చాలా ఇష్టం. కాజోల్ తో కలిసి రాత్రంతా డ్యాన్స్ చేయడమంటే మరింత ఇష్టం. అయితే, ప్రపంచంలో మేమే బెస్ట్ చెత్త డ్యాన్సర్లమని చాలా నిజాయతీగా ఒప్పుకుంటున్నాను’ అని బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ‘దిల్ వాలే’ షూటింగ్ కోసం షారుక్ హైదరాబాద్ లో ఉన్నారు. అయితే షారుక్ ట్వీట్లపై బిగ్ బీ రీట్వీట్ చేశారు. ‘షారుక్.. మీరు కాదు.. నేను చెత్త డ్యాన్సర్ ను. రాత్రంతా డ్యాన్స్ చేసి.. నేను ఈ విషయాన్ని తేల్చాను’ అని అమితాబ్ వ్యాఖ్యానించారు. కాగా, బాలీవుడ్ అగ్ర నటులు అమితాబ్, షారూక్ ల ట్వీట్లు, రీట్వీట్లను చదివిన అభిమానులు భలే ఎంజాయ్ చేశారు.

  • Loading...

More Telugu News