: టీమిండియాకు షాక్...3 పరుగులకే రోహిత్ శర్మ ఔట్
టాస్ గెలిచి హుషారుగా బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే సఫారీ బౌలర్లు షాకిచ్చారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ నాలుగో బంతికి టీమిండియా స్టైలిష్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ (3) క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో 3 పరుగుల వద్దే టీమిండియా తన విలువైన వికెట్ ను చేజార్చుకుంది. సఫారీ బౌలర్ కగిసో రబద వేసిన బంతిని ఆడబోయిన రోహిత్ శర్మ బొక్క బోర్లా పడ్డాడు. తొలి వన్డేలో 150 పరుగులు చేసిన రోహిత్ శర్మ, ఈ మ్యాచ్ లో సింగిల్ డిజిట్ కే వెనుదిరగడంతో టీమిండియా శిబిరంలో ఆందోళన మొదలైంది. మూడు ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా ఓ వికెట్ నష్టానికి 4 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (1), అజింక్యా రెహానే (0) క్రీజులో ఉన్నారు.