: తడ వద్ద పోలీసుల తనిఖీలు...అక్రమంగా తరలిస్తున్న రూ.3.35 కోట్ల బంగారం సీజ్


శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని తడ వద్ద కొద్దిసేపటి క్రితం పోలీసులు భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా చెన్నై నుంచి నెల్లూరుకు వస్తున్న ఓ కారును తనిఖీ చేసిన పోలీసులు పెద్ద మొత్తంలో బంగారాన్ని కనుగొన్నారు. బంగారానికి సంబంధించి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో కారులోని వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. సదరు వ్యక్తుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ.3.35 కోట్లు ఉంటుందని పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News