: టీవీ చూస్తూ వినోదం పొందుతున్నారా? మిమ్మల్ని బాదేందుకు టీఎస్-సర్కారు సిద్ధం!


సగటు ప్రజలకు ప్రధాన వినోద సాధనమైన కేబుల్ టీవీ కనెక్షన్లపై వినోదపు పన్ను వసూలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. వాణిజ్య పన్నుల శాఖ ఆదాయాన్ని పెంచుకునే మార్గాల అన్వేషణలో కేబుల్ వ్యవస్థ కనిపించగా, ఒక్కో కనెక్షన్ పై నెలకు రూ. 5 తమకు చెల్లించాలని ఎంఎస్ఓ (మల్టీ సిస్టమ్ ఆపరేటర్స్)లకు తాఖీదులు పంపినట్టు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 24 లక్షల కేబుల్ కనెక్షన్లు, మరో 4 లక్షలకు పైగా డీటీహెచ్ కనెక్షన్లున్నాయి. సిటీ కేబుల్, హాత్ వే, డిజీ కేబుల్, ఆర్వీఆర్, భాగ్యనగర్, ఇన్ డిజిటల్ తదితర ఎంఎస్ఓలు పని చేస్తున్నాయి. వీరి కింద రెండు వేల మందికి పైగా కేబుల్ ఆపరేటర్లు పనిచేస్తూ, ప్రాంతాన్ని బట్టి నెలకు రూ. 120 నుంచి రూ. 200 వరకూ వసూలు చేస్తున్నారు. ఇప్పుడు వినోదపుపన్ను ప్రభుత్వానికి కట్టాల్సి వస్తే, ఆ భారం కస్టమర్లపై మోపక తప్పదన్నది వీరి అభిప్రాయం. ఇప్పటికే పలు ఎంఎస్ఓలు తదుపరి నెల బిల్ నుంచి వినోదపు పన్ను చెల్లించాలని స్ర్కోలింగ్ లు ఇస్తున్నారు. పన్ను వసూలు చేస్తే, నెలకు రూ. 1.20 కోట్లు వాణిజ్య పన్నుల శాఖకు చేరుతుంది.

  • Loading...

More Telugu News