: ములాఖత్ కు వచ్చేవారి కోసం... చంచల్ గూడ జైల్లో వెయిటింగ్ లాంజ్


జైల్లో శిక్ష అనుభవిస్తున్న తమ వారిని కలుసుకునేందుకు ప్రతి రోజూ అనేకమంది జైలుకు వస్తుంటారు. ఇలా వచ్చిన వారు గంటల తరబడి బయట నిలుచుని ఎదురుచూస్తుంటారు. ఇకనుంచి అలా నిరీక్షించకుండా ఉండేందుకు చంచల్ గూడ జైల్లో 'విజిటింగ్ లాంజ్' ఏర్పాటు చేశారు. ఇకపై వచ్చిన వారు లాంజ్ లోనే కూర్చునే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా ఏసీతో సహా ఏర్పాటైన ఈ లాంజ్ లో ఒకేసారి వందమంది కూర్చునే వెసులుబాటు ఉంది. అక్కడ కూడా తమ వారితో మాట్లాడేందుకు నిరీక్షించాల్సిన అవసరం లేకుండా ప్రస్తుతం బ్యాంకుల్లో అనుసరిస్తున్న టోకెన్ పద్ధతిని ఇక్కడ అవలంబించనున్నారు. వచ్చిన వారు ముందుగా తమ వివరాలను అక్కడ నమోదు చేసుకుంటే టోకెన్ నంబర్ ఇస్తారు. దాంతో లాంజ్ లో కూర్చుని ఉంటే ఎల్ ఈడీల్లో నెంబర్ ద్వారా ఒక్కొక్కరినీ పిలుస్తారు. అలా ఎవరి నంబర్ రాగానే వారు తమవారితో మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ సరికొత్త లాంజ్ విధానాన్ని చంచల్ గూడ జైల్లో ఇవాళ డీజీపీ అనురాగ్ శర్మ ప్రారంభిస్తారని జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ తెలిపారు.

  • Loading...

More Telugu News