: హైదరాబాదు డీఆర్ డీఓకు ‘కలాం’ పేరు... రేపు కేంద్రం అధికారిక ప్రకటన
హైదరాబాదులోని డీఆర్ డీఓకు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టాలన్న తెలంగాణ ప్రభుత్వ వినతికి కేంద్రం స్పందించింది. హైదరాబాదులోని డీఆర్ డీఓకు కలాం పేరు పెట్టనున్నట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో ప్రకటించారు. రేపు కలాం 84వ జయంతిని పురస్కరించుకుని ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నామని పారికర్ చెప్పారు. 1982లో హైదరాబాదు డీఆర్ డీఓలో చేరిన కలాం దాదాపుగా రెండు దశాబ్దాల పాటు ఆ సంస్థలోని వివిధ విభాగాల్లో శాస్త్రవేత్తగా పనిచేశారు. ఇటీవల ఆయన చనిపోయిన తర్వాత హైదరాబాదు డీఆర్ డీఓకు కలాం పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన సంగతి తెలిసిందే.