: ట్విట్టర్ ఉద్యోగులపై పడనున్న వేటు!
ట్విట్టర్ తమ కంపెనీకి చెందిన మొత్తం ఉద్యోగులలో 8 శాతం మందిని తొలగించనుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీ సూత్రప్రాయంగా తెలిపారు. ఈ నిర్ణయం కనుక అమలైతే సుమారు 336 మంది ఉద్యోగులు రోడ్డున పడనున్నారు. డోర్సీ మాట్లాడుతూ, కంపెనీకి వచ్చే లాభాలు తగ్గు ముఖం పట్టడంతో వేతనాల భారం పెరిగిందని డోర్సీ అన్నారు. దీని నుంచి బయటపడాలంటే ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడం తప్ప వేరే మార్గం కనపడటం లేదని ఆయన అన్నారు. కాగా, కొత్త వినియోగదారులను ఆకర్షించడంలో విఫలం కావడం, ట్విట్టర్ కు ఉన్న ఆదరణ తగ్గుముఖం పడుతుండటం వంటి కారణాలతో ట్విట్టర్ వెనుకబడిందని విశ్లేషకులు అంటున్నారు.