: రక్తం చిందుతున్న ముఖం వీడియో ఫేస్ బుక్ లో!


మనకు నచ్చిన, ఇష్టమైన ఫొటోలు లేదా వీడియోలు ఏవైనా సరే ఫేస్ బుక్ లో పోస్టు చేస్తుంటాం. అయితే, రక్తం చిందుతున్న ఒక వ్యక్తి ముఖం దృశ్యాల వీడియో అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ వీడియోను అప్ లోడ్ చేసింది కాలిఫోర్నియాలోని కాంప్టన్ నగరానికి చెందిన ర్యాపర్ తెరిక్ రాయల్ అనే యువకుడు. తన తలలోకి ఏకే 47 బుల్లెట్లు దూసుకుపోయాయంటూ, రక్తం చిందుతున్న తన ముఖం దృశ్యాలను ఫేస్ బుక్ లో ఉంచాడు. ‘ఏకే 47 తూటాల నుంచి నన్ను, నా సోదరుడిని తప్పించు....’ అని అంటూ ఈ వీడియో గురించి రాశాడు. ఆ వీడియోలో ఒక పెట్రోల్ బంకు సమీపంలో తొక్కిసలాట జరిగినట్టు ఉంది. వీడియోలో ర్యాపర్ ‘ఇప్పుడే నన్ను తుపాకీతో కాల్చేశారు’ అని చెబుతూ కన్పించాడు. తనకు బుల్లెట్లు దిగినప్పటికీ, తీవ్రగాయం కాకుండా ఎలా తప్పిపోయిందో తెలియజేసే ఒక ఎక్స్ రేను కూడా అతను అప్ లోడ్ చేశాడు.

  • Loading...

More Telugu News