: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ఫయాజ్ అరెస్ట్
బెంగళూరుకి చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ఫయాజ్ ను కడప ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.2 కోట్ల విలువైన 4 టన్నుల ఎర్రచందనం దుంగలు, ఐదు కార్లు, 3 వ్యాన్లు, రూ.12వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లా ఎస్పీ నవీన్ గులాటి ఇవాళ ఫయాజ్ ను మీడియా ముందు ప్రవేశ పెట్టారు. అతనిపై ఇప్పటివరకు 61 కేసులు నమోదైనట్టు తెలిపారు. ఢిల్లీకి చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ హసన్ భాయ్ కి ఫయాజ్ ప్రధాన అనుచరుడని చెప్పారు.