: అమిత్ షాపై పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీం
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గుజరాత్ అల్లర్లకు సంబంధించి తన పిటిషన్ షా, ఎస్.గురుమూర్తి పేర్లను చేర్చాలంటూ మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ పిటిషన్ దాఖలు చేశారు. కేసులో ఆయనను విచారించాలంటూ దాఖలైన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. అంతేగాక చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు ఆధకవర్యంలోని ధర్మాసనం సంజీవ్ భట్ పై ఉన్న రెండు కేసుల విచారణపై ఉన్న స్టేను కూడా ఎత్తివేసింది.