: రాంచరణ్ 'బ్రూస్ లీ'కి అల్లు అర్జున్ 'ట్వీట్' మద్దతు


రుద్రమదేవి చిత్రానికి ఇంకో వారం పాటు అధిక థియేటర్లు లభించేలా చూసేందుకు, రాంచరణ్ తాజా చిత్రం 'బ్రూస్ లీ' విడుదలను మరోవారం రోజులు వాయిదా వేసుకోవాలని దాసరి నారాయణరావు చేసిన కామెంట్ పై అల్లు అర్జున్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించాడు. "మరో వారం రోజుల పాటు విడుదలను వాయిదా వేయడం లేదంటూ బ్రూస్ లీ నిర్మాతను విమర్శించడం భావ్యం కాదు. అక్టోబర్ 16న చిత్రాన్ని విడుదల చేస్తామని వారెంతో ముందుగానే ప్రకటించారు. రుద్రమదేవి సెప్టెంబర్ 4న విడుదలవుతుందని భావించే వారు నెల రోజుల తరువాత సినిమా రిలీజ్ ను పెట్టుకున్నారు. బ్రూస్ లీ విడుదల తేదీ తెలిసి కూడా రుద్రమదేవి చిత్రాన్ని సరిగ్గా వారం రోజుల ముందు 9వ తేదీన విడుదల చేసుకున్నారు. ఇప్పుడిక బ్రూస్ లీ నిర్మాతలను నిందించడం సరికాదు" అని వ్యాఖ్యానించాడు. గత రాత్రి 11 గంటల సమయంలో అల్లు అర్జున్ ఈ ట్వీట్ చేశాడు.

  • Loading...

More Telugu News