: టీమిండియాకు మరో ఫినిషర్ కావాలి: హర్షా భోగ్లే


టీమిండియాకు మరో ఫినిషర్ కావాలని ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే అభిప్రాయపడ్డారు. తొలి వన్డేలో భారత్ ఓటమిపై ఆయన మాట్లాడుతూ, ధోనీ అద్భుతమైన ఫినిషర్ అనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. అయితే ధోనీ విఫలమైనప్పుడు ఆదుకునేందుకు మరో ఫినిషర్ కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక్క మ్యాచ్ లో విఫలమైనంత మాత్రాన ధోనీ విలువ తగ్గదని ఆయన పేర్కొన్నారు. అయితే పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో మహీ దిట్ట అని, మరోసారి ధోనీ చెలరేగుతాడని ఆయన ఆకాంక్షించారు. ధోనీ స్థానాన్ని ఆక్రమించేందుకు ప్రస్తుతం కనబడుతున్న ఆటగాడు సంజు శాంసన్ అని ఆయన పేర్కొన్నారు. సంజు శాంసన్ కు కీపర్, బ్యాట్స్ మన్ గా రాణించే సత్తా ఉందని ఆయన పేర్కొన్నారు. ధోనీ చివరిదశకు చేరుకుంటున్న ప్రస్తుత తరుణంలో సంజు శాంసన్ మంచి ప్రత్యామ్నాయం కాగలడని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News