: ఇరాక్ లో పలువురు ఐఎస్ఐఎస్ నేతల హతం?
ఇరాక్ లోని అన్బర్ ప్రాంతంలో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులపై ఇరాక్ వైమానిక దళాలు చేసిన దాడుల్లో పలువురు ఐఎస్ఐఎస్ నేతలు మృతి చెందారు. ఐఎస్ఐఎస్ కు చెందిన కీలక నేతలు సమావేశమవుతున్న విశ్వసనీయ సమాచారం అందుకున్న ఇరాక్ అధికారులు వారి కాన్వాయ్, సమావేశమందిరం, ఉగ్రవాదుల స్థావరాలపై వైమానిక దాడులు చేశారు. ఈ దాడుల్లో ఎనిమిది మంది ఐఎస్ఐఎస్ నేతలు మరణించినట్టు తెలిపారు. ఈ సమావేశానికి అబు బక్ర్ అల్ బాగ్దాదీ రావాల్సి ఉండగా, ఆయనను కాన్వాయ్ నుంచి తప్పించేశారని వారు వెల్లడించారు. దీంతో బాగ్దాదీ మరణంపై సమాచారం లేదని వారు వెల్లడించారు. కాగా, బాగ్దాదీపై గతంలో అమెరికా బాంబు దాడులు చేసిది. వాటి నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నాడు. కాగా, ఇరాక్ వైమానిక దాడుల వార్తల్లో వాస్తవం లేదని ఐఎస్ఐఎస్ తన అధికారిక వెబ్ సైట్లో పేర్కొంది.