: విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది: కేఎస్ రామారావు


విశాఖపట్టణంలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని ప్రముఖ సినీ నిర్మాత కేఎస్ రామారావు అభిప్రాయపడ్డారు. విశాఖపట్టణంలో ఫిల్మ్ నగర్ కల్చరల్ సొసైటీకి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖ ఫిల్మ్ నగర్ కల్చరల్ సొసైటీ ఏడాదిలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సొసైటీ అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తుందని ఆయన తెలిపారు. దేశంలో సినీ పరిశ్రమ పూర్తి స్థాయిలో వినియోగించుకోదగ్గ పట్టణం విశాఖేనని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News