: ఆ చివరి క్షణాలలో భయపడ్డా: దక్షిణాఫ్రికా బౌలర్ రబడా


తొలి వన్డేలో స్లాగ్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి, చివరి ఓవర్ లో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన రబడా చివర్లో బౌలింగ్ చేసినప్పుడు భయపడ్డానని చెప్పాడు. ధోనీ ఆటను చూస్తూ పెరిగిన తాను, అతనికి బౌలింగ్ చేయాలంటే భయపడ్డానని తెలిపాడు. ప్రపంచ బ్యాట్స్ మన్ లో మ్యాచ్ ఫినిషర్ గా పేరొందిన ధోనీకి ఎలాంటి బంతులేయాలో తనకు అర్థం కాలేదని, అయితే పిచ్ అనూహ్యంగా బౌన్స్ అవడాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నానని రబడా తెలిపాడు. ఎక్స్ ట్రా పేస్ తో ధోనీని పెవిలియన్ బాట పట్టించానని రబడా తెలిపాడు. భారత్ పై తొలి వన్డేలో తన ప్రదర్శనను ఆటగాళ్లంతా అభినందించడం తనకు తీపి జ్ఞాపకమని చెప్పాడు. రబడా చివరి బంతిని వేయడం పూర్తి చేయగానే కెప్టెన్ సహా ఆటగాళ్లంతా అతనిని అభినందించారు. చివరి రెండు ఓవర్లు అద్భుతమైన నియంత్రణతో వేశాడని వారంతా కొనియాడారు.

  • Loading...

More Telugu News