: విశాఖ వాసుల ఆ చేదు జ్ఞాపకానికి సరిగ్గా ఏడాది!


విశాఖ తీరాన్ని అతలాకుతలం చేసిన హుదూద్ తుపాను సంభవించి నేటికి ఏడాది పూర్తయింది. విశాఖతో పాటు, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాలను ఆ నాటి ప్రకృతి బీభత్సం అతలాకుతలం చేసింది. విశాఖ నుంచి సుమారు 200 కిలోమీటర్ల వరకు హుదూద్ ప్రభావం చూపింది. వేలాది చెట్లు నేలకొరిగాయి. వందల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. రాష్ట్ర ప్రభుత్వం, స్థానికులు, స్వచ్చంద సంస్థల చొరవతో విశాఖపట్టణం త్వరగానే కోలుకుంది. నెలలు తిరక్కుండానే పచ్చదనం సంతరించుకుంది. విశాఖ వ్యాప్తంగా వందల సంఖ్యలో చెట్లను నాటారు. తెగిపోయిన విద్యుత్, టెలిఫోన్, రవాణా వ్యవస్థలను పునరుద్ధరించారు. దీంతో మళ్లీ విశాఖకు పునర్వైభవం చేకూరింది.

  • Loading...

More Telugu News