: జగన్ ను పరామర్శించిన శ్రీమతి!
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరవధిక నిరాహాదీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ను ఆయన భార్య భారతి పరామర్శించారు. నల్లపాడు రోడ్డులోని జగన్ దీక్షా శిబిరాన్ని ఈరోజు ఆమె సందర్శించారు. వేదికపై కూర్చున్న జగన్ వద్దకు వెళ్లి ఆయనతో మాట్లాడారు. ఆరోగ్యం గురించి ఆరా తీశారు. కాగా, ఈరోజుతో జగన్ దీక్ష ఐదోరోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. వైద్యులు పరీక్షించి జగన్ ఆరోగ్యం క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.