: ఈ కారణంగానే ఇంద్రాణి అస్వస్థతకు గురయ్యారు: ఐజీ


సంచలనం రేకెత్తించిన షీనాబోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలైన ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా అపస్మారక స్థితిలోకి వెళ్లి, ఆసుపత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. దీంతో, ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేక మోతాదుకు మించి మందులు తీసుకున్నారా? అనే కోణంలో ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో, దీనిపై ముంబై ఐజీ (జైలు) స్పందించారు. కేవలం బలహీనత కారణంగానే ఇంద్రాణి అస్వస్థతకు గురయ్యారని ఆయన తెలిపారు. ఇంద్రాణి మోతాదుకు మించి మందులు వాడలేదని, ఇంకా చెప్పాలంటే గత కొంత కాలంగా మందులు వాడటం లేదని చెప్పారు. డగ్స్ కూడా తీసుకోలేదని తెలిపారు. బలహీనత కారణంగానే ఆమె అస్వస్థతకు గురయ్యారని చెప్పారు.

  • Loading...

More Telugu News