: చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ రికార్డుకు చేరువలో ధోనీ
చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత కోచ్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ రికార్డుకు చేరువలో టీమిండియా కెప్టెన్ ధోనీ ఉన్నాడు. కెప్టెన్ గా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ధోనీ మూడో స్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో ఉన్న ఫ్లెమింగ్ ను అధిగమించేందుకు ధోనీ 153 పరుగుల దూరంలో ఉన్నాడు. వన్డే కెప్టెన్ గా ధోనీ ఇప్పటి వరకు 6143 పరుగులు చేయగా, ఫ్లెమింగ్ 6,295 పరుగులు చేశాడు. సౌతాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్ లో ధోనీ ఈ రికార్డును అధిగమించే అవకాశాలు ఉన్నాయి. కాగా, అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ గా ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 8,197 పరుగులతో కొనసాగుతున్నాడు.