: బాక్సర్ విజేందర్ భవిష్యత్ కి ఈ రాత్రి కీలకం


ఒలింపిక్స్ పతక విజేత బాక్సర్ విజేందర్ సింగ్ కు నేటి రాత్రి అత్యంత కీలకమైనది. భారత జాతీయ క్రీడల్లో సత్తా చాటిన విజేందర్ అమెచ్యూర్ బాక్సింగ్ కు స్వస్తి చెప్పి, ప్రొఫెషనల్ గా మారేందుకు నిర్ణయించుకున్నాడు. అతని నిర్ణయంపై సర్వత్రా నిరసన వ్యక్తమైనా విజేందర్ వెనుకడుగు వేయలేదు. ప్రొఫెషనల్ బాక్సింగ్ లో సత్తా చాటాలని నిర్ణయించుకుని, ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాడు. ప్రఖ్యాత కోచ్ లీ బియర్డ్ దగ్గర శిక్షణ పొందుతున్నాడు. విజేందర్ పంచ్ లో పవరుందని, అతని మెదడు కూడా చురుకైనదని లీ బియర్డ్ ప్రశంసల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. నేటి రాత్రి విజేందర్ సింగ్ ఇంగ్లాండ్ లోని కెంట్ ప్రాంతానికి చెందిన సన్నీ వైటింగ్ ను ఎదుర్కోనున్నాడు. సన్నీ ఇప్పటి వరకు రెండు బౌట్ లలోనే పాల్గొన్నాడు. అయితే తొలి బౌట్ లో ఒకే ఒక్క పంచ్ కు ప్రత్యర్థిని నాకౌట్ చేశాడు. దీంతో సన్నీకి డిమాండ్ పెరిగిపోయింది. విజేందర్ అమెచ్యూర్ బాక్సింగ్ లో తనను తాను నిరూపించుకున్నప్పటికీ, ప్రొఫెషనల్ బాక్సింగ్ లో నిరూపించుకునేందుకు ఇదే మొదటి అవకాశం. మొదటిది అంటే ఈ బౌట్ లో విజయం సాధిస్తే విజేందర్ రేటు, డిమాండ్ పెరుగుతాయి. సన్నీతో జరిగే మ్యాచ్ ద్వారా లభించే ప్రతిఫలం పెద్దగా లేకున్నా, ఓడిస్తే లభించే ప్రతిఫలం మాత్రం అతని భవిష్యత్ పై భరోసా ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ మ్యాచ్ ను రాత్రి 10:30 నిమిషాలకు సోనీ సిక్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

  • Loading...

More Telugu News