: కేసీఆర్ ను స్వయంగా ఆహ్వానిస్తా: చంద్రబాబు


ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వానం అందనుంది. కేసీఆర్ ను తానే స్వయంగా పిలుస్తానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నాటి కేబినెట్ మీటింగ్ లో తెలిపారు. దీనికితోడు, ప్రధాన వేదికపై 15 మంది అతిథులకు మించకుండా చూడాలని ప్రధాని కార్యాలయం తెలిపిందని.. అందువల్ల వేదికపై ఎక్కువ మంది లేకుండా చూడాలని మంత్రివర్గ సహచరులకు చెప్పారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఆహ్వాన పత్రాలు అందించాలని మంత్రులకు సూచించారు. ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీచే రాజధానికి శంకుస్థాపన జరగనుంది.

  • Loading...

More Telugu News