: సిగిరెట్ ప్యాకెట్ లో నిషేధిత ఎగిరే బల్లులు... మహిళ అరెస్టు
నిషేధిత ఎగిరే బల్లులు రెండింటిని సిగిరెట్ పెట్టెలో పెట్టి తీసుకువెళ్తున్న ఒక మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మణిపూర్ లోని చందేరీ జిల్లాలో ఒక చెక్ పోస్ట్ వద్ద జరిగింది. అక్కడికి వచ్చిన ఒక కారును అసోం రైఫిల్స్ దళం పోలీసులు తనిఖీ చేయగా ఈ విషయం బయటపడింది. దీంతో మహిళను అరెస్టు చేశారు. ఆ బల్లులను అటవీశాఖాధికారులకు అప్పగించారు. ఈ ప్రాంతంలో ఎగిరే బల్లుల స్మగ్లింగ్ జరుగుతుంటుందని, దానిని అరికట్టేందుకు పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నామని చెక్ పోస్ట్ అధికారులు తెలిపారు.